Tuesday 9 October 2012

Walk In Love - Part 2


మొత్తానికి ఎలాగోలా ఫ్రెండ్ consultancy ద్వార తన నెంబర్ కి ఫోన్ చేయించి updated resume లో తన address చూసాక అర్ధమయింది ...మాదాపూర్ CI గారి అమ్మాయి మధురానగర్ లో ఉంటోంది అని.
  ఒక రోజు తను ఇంటర్వ్యూ కి బయలు దేరుతోంది నేను కూడా వెళుతున్నా..తనని  ఫాలో అవుతూ..తనతో పాటు ఇంకో అమ్మాయి కూడా వుంది .కండపట్టిన కరెంటు pole ..పొడుగ్గా. నేను పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరకి వెళ్లి ..
                  "హాయ్ ఎలా వున్నారు ?"
                  ఒక బ్లాంక్ లుక్ ఇచ్చింది . మరిచిపోదు అని నా నమ్మకం ...అయిన మళ్ళి గుర్తుచేద్దామని
                  "అదే నండి లాస్ట్ టైం walk - in లో " అని నేను complete చెయ్యకుండానే .
                  "వీడేనా? " అని పక్కనున్న current pole నుండి ఒక వాయిస్.
  ఇంకా ఏదో మాట్లాడు తోంది చాల ఫాస్ట్ గా సర్కార్ express లాగా .. slang బట్టి అర్థమవుతోంది ..కడప బాంబు లా వుంది...
                    "వీ...డా.....? ఎంత పద్దతి గా అంది ..అయిన మా ఇద్దరం ఏదో మాట్లాడుకుంటుంటే మద్యలో నీ బోడి పెత్తనం ఏంటి ? అని అడిగేద్దాం ఆనుకున్నా...కానీ అసలు మా ఇద్దరం ఎక్కడ మాట్లాడుతున్నాం ...ఏం అడిగిన మూగనోము లో వున్న సావిత్రి లా సమాధానం చెప్పదు. తను మాట్లాడే వరకు మనకు కడప బాంబే communicator అని కాస్త ఒపికపట్టి సమయం లో బాంబు defuse చెయ్యకూడదు అనిపించింది  "
                      అయిన కనపడితే ఎడా పెడా కడిగేద్దాం  అనుకున్నా కానీ ఇప్పుడు కనీసం ఒకసారైన మాట్లాడితే చాలు అనిపించి మాట్లాడటానికి ప్రయత్నించా
                      "చూడండి " అని నేనేదో చెప్పబోతుండగా vodafone వాడికి కాల్ చేస్తే Airtel వాడు ఆన్సర్ చేసినట్టు..తన ఫ్రెండ్ మళ్లీ
                       "హే ..నీకు ఎన్ని సార్లు చెప్పాలి , తనకి ఇలాంటివన్నీ ఇష్టం వుండవు . ఇంకో సారి ఇలా విసిగిస్తే commissioner మాకు క్లోజ్ relative  .complaint చెయ్యాల్సి వస్తోంది .  '
                        "మీకు commissioner close  relative మాత్రమే ..ఆమెకు మాదాపూర్ CI స్వయానా ఫాదర్ ." అనే సరికి అప్పటిదాకా మన్ను తిన్న పాములా వున్న తను ఒక్కసారిగా తోక తొక్కినా త్రాచు లా ఫైర్ అయి పోతోంది . కడప బాంబు interfere అయి నాకు irritation తెప్పించి మొత్తానికి చెడగొట్టింది అని లోపల  తిట్టుకుంటున్న 
                         "ఇంకోసారి విసిగిస్తే సారి మాదాపూర్ CI మా ఫాదర్ అని చెప్పటం కాదు . నేనే వెళ్లి కంప్లైంట్ చెయ్యాల్సి వస్తోంది .mind it .నువ్వు రావే " అని కడప బాంబు చెయ్యిపట్టుకొని లాక్కొంటు వెళ్ళిపోతోంది.
                       "excuse me .... one min please " అని తన దారికి అడ్డగా నిలబడి ...
                       "చూడండి ఇప్పటివరకు మౌనం గా వున్నమీకు కోపం వచ్చినట్టే ..మొన్నటివరకు ఏమి పట్టని నాకు మీ మీద ప్రేమ పుట్టింది .నన్ను చుస్తే మీకు కోపంగా వుంటుంది . మిమ్మల్ని చూడక పొతే నాకు బాధగా వుంటుంది . మీ అభిప్రాయం నాకనవసరం ..కాని నా నిర్ణయం మాత్రం I Love you .'
  
                     ఏమి మాట్లాడకుండా పక్కకు తప్పుకొని వెళిపోయింది ...పారు తున్న సెలయేరు బండరాయిని తప్పించుకున్నట్టు . ప్రేమ , ఆశ  ఒక లాంటివే..పుడితే చావవు..దొరకనంత వరకు కావాలనిపిస్తాయి ..దొరికిన తరువాత ఇంకా కావాలనిపిస్తాయి .
                     అక్కడే నిలబడిపోయా అచేతనంగా ..ఏంచెయ్యాలో పాలుపోక , ఎటు వెళ్ళాలో  అర్థం  కాక ,కాసేపటకి అలా నెమ్మదిగా నడుస్తూ పక్కనే వున్నా చెట్టు నీడలో ఒక బండ రాయి పై అలానే కూర్చుండి పోయా .
రెండు రోజులు తరువాత ఒక రోజు సాయంత్రం తన ఫ్రెండ్ ,current pole లా వున్నకడప బాంబు కనపడింది ...
              "Hello Hello...excuse me "
              "ఏంటి ?'
              హమ్మయ్య " ఏంట్రా ?" అనలేదు ."మీతో ఒకసారి మాట్లాడాలి ."
              "చెప్పు ?"
              "అలా కూర్చొని మాట్లాడుకుందాం ..."
              "అవసరం లేదు ...నువ్వు దేనిగురించి మాట్లాడుదాం అనుకుంటున్నావో నాకు తెలుసు  ఏం చెప్పాలనుకుంటున్నావో  తొందరగా చెప్పు  నాకు టైం అవుతోంది ."
              "నేను తనతో ఎలాగైనా ఒకసారి మాట్లాడాలి ... please "
               "నీకు చెప్పింది అర్థంకాలేద లేక అర్థమయ్యే రీతిలో చెప్పాలా....తనని ఎందుకిలా torcher పెడతావ్ .ఇంకా తనని ఇబ్బంది పెట్టకుండా నీ దారి నువ్వు చూస్కో ..లేదంటే రోజు casual గా అన్నాఈసారి సీరియస్ గానే complaint ఇవ్వాల్సి వొస్తోంది  '
                 "ఏంటి బెదిరిస్తున్నార ? మాట్లాడితే కంప్లైంట్ అంటున్నారు . అయినా నేను చేసిన తప్పేంటి ప్రేమించటం crime అయితే ప్రపంచం లో అందరు క్రిమినల్స్సే .ఇదిగో చూడండి మీరు పోలీసు కంప్లైంట్ ఇచ్చుకున్న , POTA act కింద అర్రెస్ట్ చేసిన ...మీరెన్ని కేసులు పెట్టుకున్న ..నేను తనమీదే ఆసలు పెట్టుకున్న విషయం మీ ఫ్రెండ్ తో చెప్పండి " అని కొంచెం గట్టిగానే చెప్పా సమాధానం ...
                  వీడితో argument ఎందుకు అనుకుందో ..లేక వీడు ఎంత చెప్పిన వినడు అనుకుందో ..కాస్త కూల్ గా మాట్లాడింది సారి
                 "చూడు తన పరిస్థితి వేరు ...ఇందంతా practical గా workout అవ్వదు ...నువ్వు అనవసరమైన hopes పెట్టుకోవద్దు ...తరువాత నువ్వే బాధ పడతావు ."
                  "Atleast తనతో ఒకసారి మాట్లాడాలి .. please  ..."
                  "నీ మంచి కోరే సలహా ఇస్తున్నాతనని మరచిపో ..సరే...నాకింకా టైం అవుతోంది I am leaving  " అంటూ వెళిపోయింది .
       వాళ్ళ ఫ్రెండ్ తో మాట్లాడే అవకాశం అడిగితే..సలహా ఇచ్చి వెళిపోతోంది ..అయిన నాకు బుద్ధి లేదు ..వరం కావాలంటే దేవుణ్ణి అడగాలి ..ప్రసాదం కావాలంటే పూజారిని అడగాలి ...పూజారిని వరం అడిగితే ఇలానే వుంటుంది . దారి కూడా మూసుకుపోయింది ...దారులన్నీ మూసుకుపోతున్న కొద్ది వెళ్ళాల్సిన దారిమీద క్లారిటీ పెరుగుతుంది . Next sunday తన birthday ఎలాగైనా ఆరోజు తనని కలవాలి...
    రోజు శనివారం ...తరువాత రోజు తన పుట్టిన రోజు .. cake ఆర్డర్ చేసి 12 'o clock   కి  తన రూం కి పంపించా. wishes చెపుతూ ఒక message పెట్టా. ఒంటిగంట , రెండు అవుతుంది ...కనీసం థాంక్స్ అన్న రిప్లై కూడా రాలేదు ...propose చేస్తే reject చేసినపుడు ఇష్టం లేదు అనుకున్నా కానీ wish చేస్తే reply ఇవ్వనంత అని ఇప్పుడే అర్థమైంది . కనీసం thanks అన్న రిప్లై ఇస్తే ఏమైపోతోంది ...ఎందుకింత కటినంగా వుంటుందో అర్థం కావటం లేదు... ఆశ చచ్చి పోతోంది ..బాధ పెరిగిపోతోంది ..ఆలోచనలు పరిగెడుతున్నాయి ..తెల్లవారుతుంది అనుకుంట పక్షుల కూతలు  వినపడుతున్నాయి ..నెమ్మదిగా కళ్ళు మూతలు పడుతున్నాయి ..అలా నిద్ర లోకి జారుకున్నా..ఎంత సేపు నిద్ర పోయానో తెలియదు . Phone రింగ్ అవుతుంటే మెలకువ వచ్చింది . మాట్లాడేంత ఓపిక లేదు ...లిఫ్ట్ చేసేంత intrest  లేదు ..switch  off చేసేద్దామని ఫోన్ చేతిలోనికి తీసుకున్నా. ఒక్కసారిగా వెయ్యి ఏనుగుల బలం ..వెయ్యి వోల్ట్ల వెలుగు .మొబైల్ స్క్రీన్ మీద తన పేరు ...గుండె వేగం పెరుగుతోంది..
                             "hello .. .."
                             'hello ..'
                              "Many more happy returns of the day.."
                              "Its ok , మీకు కుదిరితే రోజు 4 'o clock కి Cafe లో కలుద్దాం మాట వినేసరికి ఇంకా నిద్ర లోనే వున్నానేమో నని నన్ను నేను గిలలుకున్న "
                              "Hello are you there ? "
                               "yeah..yeah..sure .. ఖశ్చితంగా  4'o clock  కి కలుద్దాం ..."
                               "ok..bye  అని ఫోన్ పెట్టేసింది ..."
                                ఎక్కడలేని ఉత్సాహం ..ఎగిరితే ఆకాశం అందుతోందేమో నన్నంత ఆనందం .ఒక్క ముక్కలో చెప్పాలంటే మనసు బప్పిలహరి బీట్ కి చిరంజీవి స్టెప్ లేస్తున్నట్టుంది .Half an hour లో రెడీ అయిపొయి arches లో ఒక గ్రీటింగ్ , ఒక chacolate బాక్స్ తీసుకొని 15min ముందే వెళిపోయ. సరిగ్గా నాలుగు అయింది ...తను వస్తోంది..white dress లో కడిగిన ముత్యం లా, నెహ్రు చేతిలో పావురం లా  వుంది .తను దగ్గరకు వస్తున్నకొద్దీ dopler effect లాగా గుండె చప్పుడు పెరిగిపోతోంది ..తను దగ్గరకి వచ్చేసరికి గొంతు సవరించుకొంటూ ...
                "Hi many more happy returns of the day  "అని విష్ చేశా చేతిలో గ్రీటింగ్ కార్ట్ ,బాక్స్ తనకి ఇస్తూ..
             "చిన్నగా నవ్వింది " (అని నాకనిపించింది ) పెదాలు గాలికి ఊగిన గులాబి రేకుల్లా కదుపుతూ ..
                ఆర్డర్ ప్లేస్ చేసిన తరువాత నేనేదో మాట్లాడేస్తున్న ..ఏం మాట్లాడాలో తెలియని సంతోషం లో .
                "Actual గా నీతో ఒక విషయం మాట్లాడుదాం అని వచ్చాను "అని నా వాగుడుకి బ్రేక్ వేసింది .
                "ఏంటి ?' అన్నట్టు చూసా
                 " రోజు నా b 'day  కాదు "
                 "'అవునా ! మరి resume లో రోజనే వుంది కదా ?"
                 "certificate లో అలా వుంటుంది "
                 "Oh..wish you happy certificate birthday .." జోక్ అని నేను ఫీల్ అయ్యాను..కానీ తన మొహం లో ఒక్క expression లేదు ..మన్మోహన్ సింగ్ లా..
                  "చూడు ...నా వల్ల ఒకరు ఇబ్బంది పడటం నాకిష్టం వుండదు .లేని పోని problems లేకుండా విషయాన్నిఇక్కడితో వొదిలేస్తే బాగుంటుంది .ఇది practical గా  workout అవ్వదు ."
                  కేఫ్ లో కలుద్దాం అని ఫోన్ చేస్తే .జీవితం లో కొత్త వెలుగు వస్తోంది అని అనుకున్నాకానీ అరిపోఎముందు వెలుగుతుందని అర్థం చేసుకోలేక పోయాను .
                  "సరే practical గా  workout అవుతుందా అవ్వదా అని వోదిలేయండి నీకు ఇష్టమా కాదా ? అది చెప్పు   .."
        "ఒకసారి చెపితే అర్థం కాదా నన్నెందుకిలా బాధ పెడుతున్నావ్ ?"
        "బాధ పెడుతున్నాను అని నువ్వంటున్నావ్...ప్రేమిస్తున్నాను అని నేనంటున్నాను ..నిజమే ఇద్దరమూ బాధ పడుతున్నాము ..నీ జీవితం లోనికి నేనెందుకొచ్చాన అని నువ్వు బాధ పడుతున్నావ్ ..నా జీవితం లోంచి నువ్వెందుకెలిపోతున్నావా అని నేను బాధ పడుతున్నాను. ప్రేమ వున్నచోటే బాధ కూడా వుంటుంది . ప్రేమ బాధ అనేవి వెలుగు ,నీడ లాంటివి ..వెలుగు వున్న చోటే నీడ వుంటుంది ..నీడకు భయపడి వెలుగు కి దూరంగా జరిగితే చీకటిలో మిగిలిపోతాం ..బాధ కి భయపడి  ప్రేమ కి  దూరంగా జరిగితే శూన్యం లో మిగిలిపోతాం     "
          (కాసేపు ఇద్దరి మద్య మౌనం ...)
   "అయిన ఈ విషయం చెప్పటాని కైతే  ఎందుకు రమ్మన్నావు ? ఇలా కలవ కుండ వుంటే కనీసం ఆశ తో నైన బతికే వాడిని ..."
          "ఎందుకు చెపుతున్నానో అర్థం చేసుకో ...జీవితమంటే ప్రేమొక్కటే కాదు ...అది చాల బంధాలు తో  అల్లుకున్న సాలెగూడు లాంటిది .. ఎ బంధం తెగకుండా వుండాలి అంటే ఎటు కదలకుండా వుండాలి..కాదని మనకు నచ్చిన వైపు వెళితే తెగిపోయే వాటిని తట్టుకో గలిగే లా వుండాలి. అయినా పదినిమిషాల పరిచయం లో నా గురించి నీకు ఏమి తెలియకుండా పుట్టేది ప్రేమే.....  "
            "అంటే నీ ఉద్దేశ్యం ఏమిటి ?" అడ్డు తగిలాను తను చెప్పటం పూర్తి కాకుండానే .."ameerpeta లో చూసాడు Hi -tech  సిటీ లో I love you  అన్నాడు ..రేపు కోటి లో కోపమొస్తే అబిడ్స్ లో I hate you     అనేస్తాడు   అనుకుంటున్నావా ? వయసొచ్చాక కలుసుకోటానికి ..తెలిసొచ్చాక విడిపోటానికి ఇది infatuation కాదు ...ప్రేమ.. నా జీవితం .. నాకు నా జీవితం కావాలి...అందులో నువ్వుండాలి..నీ నవ్వుండాలి .. "  
   ఫాట్ మని ఒక శబ్దం ...అందరి కళ్ళు నా చెంప మీద పడేలా ..ఏం జరిగిందో తెలుసుకునే లోపే తను వెళిపోతోంది కళ్ళు తుడుచుకుంటూ ..ఏడ్చుకుంటూ ..కొందరు నన్ను ఏదో పురుగుని చూసినట్టు చూస్తున్నారు ...మరి కొందరు "ఎవడో బకరా గాడు ?" అన్నట్టు నవ్వుకుంటున్నారు ..చాల కొద్ది మంది మాత్రమె వచ్చిన పని చూసుకుంటున్నారు .
                నాకు వొళ్ళంతా ముల్లుతో గుచ్చుతున్నట్టుంది ..వీలైనంత తొందరగా చోటు నుంచి బయట పడ్డా..టేబుల్ మీద తను వొదిలేసిన chacolate box పట్టుకొని..Box ఉద్దేశం తో పట్టుకోచ్చానో ? పరిగెత్తుకెళ్ళి ఇద్దామన ? బయటకు వొస్తే గాని అర్థం కాలేదు ...
                బయట ఏడెనిమిదేళ్ళ కుర్రాడు .ఒంటి మీద చిన్న చినిగిన నిక్కరు తప్ప ఏమి లేదు ..
                "అన్నా...ఆకలేస్తోంది అన్నా .."
                "చేతిలో chacolate box వాడి చేతిలో పెట్టి పార్క్ చేసి వున్నా బైక్ ని తీసుకుంటున్నా..వాడు నన్నే చూస్తూ అలా ఉండిపోయాడు ...వాడికి అదృష్టం పట్టిందో ...నాకు పిచ్చి పట్టిందో అర్థం కాక '