Thursday 21 June 2012

మౌనరాగం

  
చీకటి కురులలో
చుక్కల పూలు పెట్టుకొని
చక్కని చందమామ ..
మబ్బు తెరల మద్య సిగ్గు పడుతూ..
ఆలపిస్తోంది  వెన్నెల  గీతాన్ని ..

అలల లయల లో
హాయి గా ఊగుతూ
కొలనుకలువ
కను కొనలలో కాంతి నింపుకొని
అలకిస్తోంది ఆ మౌనరాగాన్ని ..

Saturday 2 June 2012

నీ మహిమ

 నాకు తెలుసు
 నా కోసం నువ్వు ఆగవని..
 అయినా  గతం లో జ్ఞాపకం లా..
 భవిష్యత్తు లో ఆశ లా..
 ఈ క్షణం ఒక నిజం లా..
 నిన్ను వొదల లేను
 అది నీ బలం నా బలహీనత .

నా మీద కోపం వస్తోంది నీకు
ఎన్ని సుడి గుండాలో
ఎన్ని  ఎండమావులో
ఏం తప్పు చేసానని నన్నే నేను
నిందించుకున్న తరుణం లో ..
ఒక్క నవ్వు   నవ్వుతావు
ఎన్ని వసంతాలో
ఎన్ని ఆశలో
తలుపు తెరుచుకున్న తలపులెన్నో
తొలి అరుణంలో.
ఒక్కటే కోరిక ఆ క్షణం
నా చేయి పట్టుకొని అలా వుండి పోవాలని
కాని  నాకు తెలుసు
నా కోసం నువ్వు ఆగవని.