Saturday 10 March 2012

సాగిపోని


                                  సాగిపోని  
              గుండె చప్పుడు కూడా వినలేని దౌర్భాగ్యపు  గుంపులో

              ఎత్తైన రక్షణ గోడల నీడలలో

              సమాధి కావొద్దు..

               కష్టం వొస్తే కాలం కాటేసిందని

              నష్టం వొస్తే నా తలరాత ఇంతే నని ...

              నీరసించి పోవద్దు..

              ఆశలన్నీ ఆవిరవుతున్నట్టుంటే ఆవేశపడకు

             ఒకింత ఓపిక పట్టు వాన చినుకులై వెల్లువవుతాయి
 
             ఏ  కోకిల మౌనం వసంతాన్ని ఆపగలిగింది

             ఏ చీకటి మాత్రం సూర్యున్ని దాచగలిగింది..