Thursday 6 September 2012

WALK-IN LOVE---PART 1



                            జనాలు అంతా వీకెండ్ ని ఎంజాయ్ చేసే హడావుడి లో వుంటే నేను మాత్రం neat గా tuck  చేసుకొని ,షూస్ వేసుకొని resume చేతిలో పట్టుకొని Ameerpet నుంచి Hitech సిటీ బయలుదేరాను . వెధవ జీవితం  ఇంకా ఎన్నాళ్ళు ఇలా తిరగాలో అనుకుంటూ బస్సు ఎక్కినా నాకు కిక్కిరిసిన జనల మధ్య అప్పు డప్పుడు కొంచెం కొంచెం గా కనిపిస్తున్న నవ్వు కాస్త కిక్ నిస్తుంది .తనని చూడటం తోనే సరిపోయింది. స్టాప్ ఏంటో కూడా తెలియదు ..ఏదో తను దిగిపోతోంది అని దిగిపోయా అప్పటికి గాని తెలియదు hitech సిటీ అని , ఇంటర్వ్యూ కి వచ్చాను అన్న సంగతి కూడా మరచి పోయి తనను ఫాలో అవుతున్న .తను కూడా నాలానే ఇంటర్వ్యూ కి వచ్చినట్టు వుంది . అలా  తన వెనుక వెళుతున్నపుడు అర్ధమైంది నేను కూడా అదే కంపెనీ లో ఇంటర్వ్యూ కి వచ్చాను అని.

ఎలాగైనా తనతో మాట్లాడాలి అనుకుంటున్నా ..ఇంతలోనే తను  నెమ్మదిగా నా వైపు నడుచుకుంటూ వస్తోంది గాలికి చిన్నగా ఎగురుతున్న కురులు సర్దుకుంటూ

                  మనసు ఊహల్లో తేలిపోతోంది తొలిప్రేమ సినిమా లో  PawanKalyan ని  కీర్తిరెడ్డి టెంపుల్ లో పిలిచినట్టు పిలుస్తోందేమోనని అంతలోనే నేల మీదకు వచ్చి ఆయన budget వేరు మన budget  వేరు అని తెలుసుకొని , Roommate resume లోని పేరు ,percentage మార్చిన resume తీసుకొని చూసుకుంటున్న ...ఇంతలోనే

                  ఇళయరాజా tune  లా "excesume " అంటూ ఒక గొంతు..ఒక్కసారి వెనకకు తిరిగి చూసా

అంతే...తను ఏదో అడుగుతోంది.. మనకు మాత్రం Already Rehnam Beat స్టార్ట్ చేసేసాడు .అలా చూస్తూ ఉండిపోయిన నన్ను ఒకసారి కాస్త విచిత్రంగా చూసుకుంటూ వెళిపోతోంది..

              "హలో హలో  excesume "

              "What "

              "ఏదో అడుగుతున్నారు కదా ?"

              "ఉహు ... Nothing " అంటూ వెళిపోతోంది .

              "ఓహో ... కావాలనే చూసారా !"

               ఒక్కసారి వెనుకకు తిరిగి "Nonsense "  అని కాస్త చిరాకుగా face పెట్టి వెళిపోతున్న తన దగ్గరగా రెండడుగులు వేస్తూ..

             "మీరు interview  కి  వచ్చారా ?"

        Theater కి వచ్చిన వారిని సినిమా కి వచ్చారా... గుడిలో కనపడ్డ వారిని  గుడికి వచ్చారా అని అడిగినట్టే ..resume పట్టుకొచ్చిన వారిని interview  కి వచ్చారా అని అడగటం మన ధర్మం .ఎంత చెత్త ప్రశ్నఅడిగాను  అనుకొనే లోపే

               "లేదు ఇంటికి Loan ఇస్తారంటే వచ్చాను " అని టక్కున సమాధానం చెప్పి తన దారిన తను వెళిపోతోంది ..

A.C  హాల్ , మీటింగ్ రూం లా వుంది . HR ఏదో చెపుతోంది బహుశా Exam instructions అనుకుంటా మనకి ఏమి వినపడటం లేదు ..మైండ్ లో query రన్ అయిపోతోంది select * from girls where dresscolor="Blue" అని మొత్తానికి కనపడింది ఒక చివర కూచొని సీరియస్ గా వింటోంది. కాస్త relax అయి అటు ఇటు సర్దుకున్నా..అందరూ చాల సీరియస్ గా వున్నారు ..చూస్తుంటే Objective questions కూడా additionals అడిగేలా వున్నారు .HR  qeustion  పేపర్  ఇచ్చేసి ,duration 45 min అని చెప్పి వెళ్లి పోయింది ,కానీ నా టైం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందని నాకు తెలుసు. ఈ 45 min లో కుదిరినప్పుడు question paper ని.. అప్పుడప్పుడు answer paper ని చూస్తూ మిగతా టైం అంతా తనని చూస్తూ మొత్తానికి A,B,C,D ల దయవల్ల ఏ ఇబ్బంది లేకుండా అలవోకగా answer చేసి బయట పడిపోయా

అందరూ బయటకు వచ్చేసి serious గా discuss చేసుకుంటున్నారు ఏ question కి ఏ answer రాసారా అని అంతలోనే నీలిమేఘం లా  వెళిపోతోంది తను.. పక్కనుంచి..కళ్ళు catch చేసినంత fast గానే కాళ్ళు start చేసేసాయి అటు వైపు అడుగులు వేయటం ..Cafeteria లో table పై హ్యాండ్ బాగ్ పెట్టి ,ఒక sandwich ,మాజా ఆర్డర్ చేసుకొని తెచ్చుకొని కూర్చుంటోంది .నేను కూడా ఒక coke order చేసుకొని ఎదురుగా వున్నా chair ని తీసా కూర్చుందామని .టక్కున తలెత్తి ఒక చూపు చూసింది ...

           "వీడెవడు ?" అనో లేక "వీడు వదలడా ? " అనో ఆ చూపు మాత్రం అర్ధం కాలేదు .

            ఒక చిన్న నవ్వు నవ్వి... "exam ఎలా రాసారు?" అని అడిగా

            "చేతితో " అని సమాధానం చేపుతోందేమోనన్న చిన్న భయం మార్నింగ్ తగిలిన షాక్ తో. కానీ

విచిత్రంగా తలూపింది ...

             sandwich తింటూ సమాధానం చెప్పలేక తలూపిందో ...సమాధానం చెప్పటం ఇష్టం లేక sandwich తింటూ తలూపిందో గాని బాగానే రాసిందని అర్థం చేసుకున్నాను .

             " మీతో మాట్లాడాలి ."

              "ఏంటి ?"

              "ఐ లవ్ యు '

               "వాట్? are you mad ? పరిచయం అయి పది నిముషాలు కూడా కాలేదు అప్పుడే ప్రేమ ? పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకుండా పనిచూస్కో "

               "పోనీ పరిచయం అయిన 15 min 32 sec కి చెప్పనా? రాహుకాలం చూసుకొని రావటానికి ప్రేమ పంచాంగం ఫాలో అవ్వదు..It happens ..అంతే . అయిన గాలెప్పుడు వీస్తుంది ,వానెప్పుడు పడుతుంది ,ప్రేమ ఎప్పుడు పుడుతుంది ఇలాంటి ప్రశ్నలకు ఎవరి దగ్గర  సమాధానాలు వుండవు   "

               "కానీ నీ లాంటివాడికి సమాధానం నా దగ్గర వుంది  ఇంకోసారి ఇలా విసిగిస్తే మర్యాదగా వుండదు .leave me alone ." అని serena  williams  serve  చేసిన  tennis బంతి ల సర్రున వెళిపోయింది .

 ఏంటో జీవితం లో కొన్ని సార్లు నచ్చిన పనికోసం ఎన్ని పాట్లైన పడాలనిపిస్తోంది , నచ్చిన మనిషి కోసం ఎన్ని తిట్లయిన తినాలనిపిస్తోంది .ఇప్పడు మన పరిస్థితి ఇంచు మించు అలానే వుంది .

               ఆమె వెనుకనే పరిగెత్తుకుంటూ వెళ్లి " ఏంటండి ? మీ దగ్గర సమాధానం వుందని చెప్పి చెప్పకుండా వెళ్ళిపోతున్నారు "

               "చూడూ....... నా గురించి నీకు తెలియదు . మా నాన్న గారు మాదాపూర్ CI ."

               "ఓహ్ ...అవునా...? మా father Ex Army man."

               "ఏంటి వెటకారమా ? " నడుచుకుంటూ వెళుతున్న తను ఒక్కసారిగా ఆగి "నేను మా ఫ్యామిలీ ని పరిచయం చెయ్యటం లేదు ...నీ future ని గుర్తు చేస్తున్న ."

                "అలా  అంటారా ? morning మిమ్మల్ని చూసినపుడే నా future  గుర్తోచ్చేసింది అందుకే వదులుకోలేక పోతున్నా.."

                 "పళ్ళు రాలిపోతాయి " కొంచెం కరుగ్గానే చెప్పింది సమాధానం...

                 "పళ్ళు రాలిపోతాయి ...అకులెండి పోతాయి ....కొమ్మలిరిగి పోతాయి ఇవి కాదండీ... ఒక మాంచి మాట చెప్పండి  "

                 తను ఏమి మాట్లాడకుండా అలా వెళ్ళిపోతూ ఎదురుగా వస్తున్నా ఇద్దరు అమ్మాయిలతో ఏదో అడుగుతోంది ..ఖచ్చితంగా తెలుస్తోంది తను ఏదో నా నుంచి తప్పించుకోటానికి మాట్లాడుతోంది ..

                  నా పాకెట్ లోంచి మంచి పాట వస్తోంది.. ఎవడో గాని మంచి టైం కి కాల్ చేసాడు అనుకోని తీసా ...నా ఫ్రెండ్ ..కరెక్ట్ టైం కి కాల్ చేసావ్ రా అనుకొని కాల్ లిఫ్ట్ చేశా..

                  "ఏంట్రా ? " అని అంటున్నాను గాని ..చూపులన్నీ తన వైపే ...

                  "ఎక్కడున్నావు రా ?"

                  "ఎక్కడ వుంటే ఏం లే గాని .చెప్పు ఏంటి సంగతులు .."

                  "urgent గా డబ్బులు కావాలి మామ.."

                  "ఇది బాగుంది రా..చక్కగా జాబు చేస్తూ నెలకి 25000 salary తీసుకుంటూ మళ్లీ నన్ను డబ్బులు అడగటానికి సిగ్గులేదరా ?"

                  "నిన్ను అడుగుతోంది job లేకో ..సిగ్గు లేకో కాదురా...డబ్బులు లేక "

                  "అదేంట్రా? వీకెండ్ పార్టీ లు ఎక్కువయ్యాయ ?"

                  "కాదురా weekdays కష్టాలు ఎక్కువయ్యాయి..."

                  "ఏమయిందిరా ?"

                  " నీకు తెలియదురా బాబు ...rating ఇవ్వని manager ,address లేని avanger ,అప్పివ్వని friend ,ముద్దివ్వని girlfirend ..అన్ని ఉన్నట్టే ఉంటాయిరా ..కానీ ఏవి వుండవు..."

                   "address లేని avanger ఏంటి రా ? "

                   "అవును రా ? మొన్న ఆఫీసు బయట పార్క్ చేస్తే ఎవడో లేపేసాడు..నిన్ననే మాదాపూర్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి వస్తున్నా... "

 తను వెళిపోతోంది ..

                   "అరె నీకు మళ్లీ కాల్ చేస్తాను..నీ frustration నాకు అర్థమైంది ...ఇప్పుడు కాస్త busy గా  వున్నాను..evening మాట్లాడుదాం ...సరే రా bye ..... ' అని ఫోన్ కట్ చేసి. తను వెళ్తున్న వైపు వెళుతున్నా ...written exam results announce చేస్తున్నారు ..తను సెలెక్ట్ అయింది ...నేను అవ్వలేదు...రెండింటిలోన ఆశ్చర్యం లేదు...తన దగ్గరకు వెళ్లి



                    "congratulations "

                    "thank you ..' మీది ఏమింది ?

                    "నేను select అవ్వలేదు .'

                    "ఓహ్ ..I am sorry . ఇప్పటికైనా సీరియస్ గా ట్రై చెయ్యండి "

            నేను సీరియస్ గానే ట్రై చేస్తున్న కాని మీకే అర్థం కావటం లేదు అని చెపుదాం అనుకున్నా ఇంతలో సెలెక్ట్ అయిన వాళ్ళందరని పిలుస్తున్నారు ..

                     ఫాస్ట్ గా వెళిపోతోంది తను..

                    "Helo..Helo..excesume ...one  min "

                    "All the best..inverview బాగా చెయ్యండి "

                    "Thank you "

                    Almost half an hour అవుతోంది ..తను లోపలకి వెళ్లి lawn లో వున్నబెంచ్ మీద కూర్చొని వెయిట్ చేస్తున్న .  అందరు మెడ లో ఐ-కార్డు లు వేసుకొని వున్నారు..కొంత మంది చాల బిజీ గా మాట్లాడుకొని వెళుతున్నారు. కొంత మంది చేతిలో కాఫీ cups పట్టుకొని ...మరికొంత మంది Laptop లను చంటి పిల్లల్ని ఎత్తుకున్నట్టు పట్టుకొని...emargency ward లో డాక్టర్ లు ,nurse లు తిరుగుతున్నట్టు తిరుగుతున్నారు అటూ  ఇటూ... .ఎంత బిజీ జీవితాలు వీళ్ళవి ..తినటానికి కూడా టైం ఉండనంత బిజీ గా వున్నారు అనుకుంటున్నా



                      Handbag  సర్దుకుంటూ  లోపలి నుంచి  వస్తోంది తను



                     "Helo , ఎలా జరిగింది interview ?"

                     "పరవాలేదు బాగానే చేశా..ఒక వారం రోజులలో ఆఫర్ రిలీజ్ చేస్తాం అన్నారు ."

                     "ఓహ్.. మరి పార్టీ ఎక్కడ ఇస్తున్నారు ?"

                   "కొంచెం ఎక్కువ చేస్తున్నట్టున్నారు ..ఇంకా ఆఫర్ లెటర్ కూడా రాలేదు అప్పుడే పార్టీ నా ? అయిన పార్టీ ఇచ్చే ఉద్దేశం కూడా లేదు .."

                     "అదేంటండి సెలెబ్రేట్ చేసుకోవలసిన టైం లో కూడా silence గా వుంటారు ."

                     "ఈ రోజు నాకు  job వచిందని  పార్టీ అడుగుతారు ...రేపు మీకు job వచ్చిందని పార్టీ ఇస్తానంటారు ...అలాంటి ఆలోచనలు ఏమి పెట్టుకోవద్దు.. "

                     "సర్లెండి ..నాకు job వచ్చిన మీరే పార్టీ ఇద్దురు కాని ."

            చిన్నగా నవ్వింది ...జాబు వచ్చిన ఆనందం అనుకుంటా..చాల హ్యాపీ గా వుంది..సాదారణంగా అమ్మాయి నవ్వితే అందంగా వుంటుంది...అందమయిన అమ్మాయి నవ్వితే అద్భుతంగా వుంటుంది ..అదే ప్రేమించిన అమ్మాయి నవ్వితే ప్రాణం లేచివచ్చినట్టుంటుంది ..

                                                                                   ***

                   Almost four days అవుతోంది ..ఈ నాలుగు రోజులు ఆలోచనలన్నీ ఆమె చుట్టూనే తిరుగుతున్నాయి. ఎలాగైనా తనతో మాట్లాడాలి అనిపిస్తోంది .ఎడురుగా మాట్లాడినప్పుడే essay questions కి objective answers ఇచ్చేది ..ఇప్పుడు ఫోన్ లో మాట్లాడుతుందా ? ఇంతకీ గుర్తుపడుతుందా ? అలాంటి ఆలోచనలతో తన నెంబర్ dial చేశా .

                   "Hello "

                   "హాయ్ ఎలా వున్నారు?"

                    "who's this?"

                    "అదేనండి మొన్న Walk -In లో కలిసాం కదా..గుర్తుపట్టలేదా ?"

                    "నా నెంబర్ మీకు ఎలా తెలుసు .? ఎవరిచ్చారు ? ఇంకెప్పుడు ఇలా కాల్ చెయ్యొద్దు " అని కట్ చేసేసింది .

                మాట్లాడి నాలుగు రోజులయ్యిందన్న పిచ్చి ..కాల్ చేస్తే కట్ చేసిందన్న కోపం ..కనీసం రెండు నిమిషాలన్న మాట్లాడలేదన్న బాధ  అన్ని కలిపి చిరాకుగా అనిపిస్తోంది .ఎలాగైనా తనని ఒక సారి చూడాలి , మాట్లాడాలి .కానీ  ఎక్కడ వుంటుంది ? ఆ రోజు తన resume లో ఫోన్ నెంబర్ చూసినట్టే అడ్రస్ తెలుసుకోనందుకు నా మీద నాకే కోపం వస్తోంది .అంతలోనే sudden గా గుర్తొచ్చింది .

                      "చూడు ..నా గురించి నీకు తెలియదు  మా నాన్నగారు మాదాపూర్ CI  " అన్న తన మాటలు ..

                యాహూ...ఆ మాత్రం హింట్ చాలు చెలరేగిపోతాను అనుకున్న...అంతే పది నిమిషాల్లో  అమీర్ పేట లో మాదాపూర్ బస్సు ఎక్కేసాను .బస్సు అయితే ఆవేశంగా ఎక్కేసాను గాని కుదురుగా కూర్చున్నాక ఆలోచనలు మొదలయ్యాయి . వెళ్లి ఏమని అడగను ?

                      "Sir CI గారు మీ అమ్మాయిని లవ్ చేస్తున్నాను ఇంటి అడ్రస్ కాస్త చెపుతారా ...అనా? "అంతే తరువాత రోజు పేపర్ లో

                      -- Hyderabad outskirts లో గుర్తు తెలియని శవం --,

                    --Chain snaching లో నిరుద్యోగ యువత --- ఇలాంటి హెడ్ లైన్స్ లలో దేనికో ఒక దానికి మన ఫోటో పేస్టు అయిపోవటం ఖాయం .పోనీ అక్కడకు వెళ్లి స్టేషన్ దగ్గర ఎవరినైనా ఎంక్వయిరీ చేస్తే..? సర్లే రెక్కి లో వున్నా ఇంఫోర్మేర్ అనుకుంటే ...అదో తలకాయ నొప్పి...ఇలా కాదు ఏదయినా పక్కగా వుండాలి అని అనుకొంటుండగా అప్పుడు తట్టింది ...ఆ రోజు ఇంటర్వ్యూ కోసం వెళ్ళినపుడు బక్కోడి నుంచి ఫోన్ వచ్చింది...వాడి Avanger పోయిందని ..మాదాపూర్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు అని..వెంటనే వాడికి ఫోన్ చేశా ..

                      "ఎక్కడున్నావు రా ?"

                      "రూంలోనే రా.. చెప్పు ఏంటి సంగతి ?"

                      "ఏమి లేదురా నీ బండి పోయిందని స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చావు కదరా .మళ్లీ దాని గురించి ఏమయినా అడిగావా ?"

             "ఎందుకురా బాబు ...చెరకు మిషన్ లో చెయ్యయిన పెట్టొచ్చు గాని పోలీసు స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వకూడదు రా...రసం పిండేస్తున్నారు"

                       "సరే నువ్వు తొందరగా రా ఒకసారి మనం CI గారితో మాట్లాడుదాం .." అని ఫోన్ పెట్టేసి ఈ ఐడియా కి detective నారద లా ఫీలయిపోయి  వాడు వచ్చేంత వరకు  స్టేషన్ కి ఎదురుగా రోడ్ కి అవతల వైపు  వున్నా టీ కొట్టు దగ్గరకు వెళ్లి ఒక టీ చెప్పి...కూర్చున్న ..వాడు వచ్చే లోపు ఈ టీ కొట్టు వాడితో కాస్త మామ గారు పోలీసు స్టొరీ లో సాయికుమార్ టైపో ఏంటో అని  enquery చేద్దాం అని పించి..

                       "భయ్యా .! మన CI గారు ఎలా ఉంటారు?" అని అడిగా..

                       "పొడుగ్గా ..." అని చాలా casual గా సమాధానం చెప్పి. టీ నా చేతిలో పెట్టి    కుంటు కుంటూ వెళిపోతున్నాడు ...టీ సిప్ చేసాక అర్థమైంది వీడు టీ కంటే కామెడీ బాగా చేస్తాడు అని..

                       అవసరం మనది ...మళ్లీ ట్రై చేశా..."అదికాదు భయ్యా ఆయన సీరియస్ గా ఉంటాడా లేక నెమ్మదస్తుడా అని."

                       "చాలా మచివాడు సర్, ఈ టీ కొట్టు పెట్టుకోటానికి బ్యాంకు లోన్ కోసం ఆయనే సాయం చేసారు సర్ , "

                       "ఓహ్.. sinceriety తో పాటు మానవత్వం కూడా వున్నదన్నమాట "

                       "అంతకు మించి కోపం వున్నా మనిషి సర్...."

                       "అదేంటి ?"

                       "రెండేళ్ళ క్రితం మూడు లక్షలు దొంగతం కేసు లో దొరికి పొతే కాలు విరగ్గొట్టి వికలాంగుడి కోట లో లోన్ ఇప్పించారు సర్...మనిషి మంచోడే...కాకపోతే ఏదైనా పద్దతిగా వుండాలి  అనుకుంటారు "

                       చేతిలో గ్లాసు ఎప్పుడు పడిపోయిందో కూడా తెలియదు.

                       నా ఫ్రెండ్ వచ్చేసాడు..ఇద్దరం కలసి....స్టేషన్ కి వెళుతుండగా...ఎదురుగా వస్తున్నాడు ఒక 25 years వుంటాయి ఒక వ్యక్తి ...

                     "ఇదిగో బాబు లోపల CI గారున్నారా .?"

                      "లేదు డాక్టర్ గారు వున్నారు ...మొన్న chain లాగినపుడు చేయ్యిరిగిపోతే treatment చేయించుకొని వస్తున్నాను.. "అని irritation లో ఏదో అనుకుంటూ వెళిపోతున్నాడు ...వాడు చెప్పకపోయినా వాడి face లో CI  గారి  sincerity , seriousness క్లియర్ గా కనిపిస్తున్నాయి .. అడుగులు ముందుకు కంటే వెనుకకే comfort గా పడతాయి అనిపోస్తోంది .కానీ వేరే దారి లేదు...ఎలాగయినా తను ఎక్కడ వుంటుందో ఈ రోజు తెలుసుకోవాలి .ధైర్యం చేసి ఇద్దరం కలసి మొత్తానికి లోపలకి వెళ్ళాము  . ఆ Head చుస్తే Head లాగానే వున్నాడు...ఎదురుగా టేబుల్ మీద ఏదో సీరియస్ గా రాసుకుంటూ ..నెమ్మదిగా తలెత్తి ..

                       "ఆ,,, ఏంటి ?"

                       "Sir ..మొన్న బండి పోయిందని కంప్లైంట్ ఇచ్చాం సర్...దానిగురించి కనుక్కుందాం అని వచ్చాం సర్...'

                       "కూర్చోండి " అంటూ ఒక బెంచ్ వైపు చూపించారు ..

                   పది నిముషాలు తరువాత Head గారు వచ్చి ..CI గారు పిలుస్తున్నారు అంటే..అయన గదిలోనికి వెళ్ళాం . లోపలి వెళ్లి చూసే సరికి వీడి బండి సంగతి ఏమో గాని నాకు మైండ్ పోయింది  . తట్టుకోలేనంత కోపం ..ఆపుకోలేనంత ఆవేశం ..వెంటనే బయటకు వచ్చేసి ఎదురుగా వున్నా టీ కొట్టు దగ్గరకి వెళ్లి కూర్చున్న...మైండ్ లో చాల ఆలోచనలు పరిగెడుతున్నాయి ..పది నిముషాలు తరువాత వాడు బయటకు వస్తూ

                        "అదేంట్రా ? CI తో మాట్లాడుదాం ని చెప్పి అలా వచ్చేసావ్ సడన్ గా ?"

                        "ఏమి లేదు గాని నన్ను అర్జెంటు గా రూం లో డ్రాప్ చెయ్యరా..."

                        "friend bike తీసుకొచ్చాను రా ..తొందరగా వెళ్ళాలి ..."

                        "చెప్పాను కదరా..నాకు చాల చిరాకుగా వుంది ...నన్ను అర్జెంటు గా రూం దగ్గర డ్రాప్ చేసేయ్ .."

                        "అయిన జగన్ కి జయలలిత మీద కోపం వచ్చినట్టు ..వీడికి  CI  ని చూస్తే చిరాకు వస్తోంది ఏంటి  సంబంధం లేకుండా .?." అని వాడి లో వాడె అనుకుంటూ  బైక్ తీస్తున్నాడు .

                        ఇద్దరం బయలుదేరాం ..వాడేదో చెపుతున్నాడు ...పోయిన బండి గురించి ...నేనేదో ఆలో చిస్తున్నా పోతోన్న ప్రాణం గురించి..
 ఎంత పనిచేసింది ...ఇప్పుడు తనని ఎలా కలవాలి ..?ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలి ? ఒక వైపు మిస్ అవుతున్నానన్న బాధ , మరోవైపు ఎందుకలా చెప్పిందన్న కోపం ..ఈ CI కి మహా అయితే ౩౦ వుండవు ..ఈయన తన తండ్రి అని చెప్పి  తప్పించుకుంది ..ఫోన్ చేసి ఎడా పెడా తిట్టేద్దాం అనుకున్నా..ఆ ఛాన్స్ కూడా లేదని తెలిసి ఏమి చెయ్యలేక రూం కి వెళ్లి బెడ్ మీద అలానే పడుకుండి పోయా ...కానీ నిద్దుర రావటం లేదు...ఆలోచనలు పోవటం లేదు...పైగా ఎలాగైనా కలవాలి అన్న పట్టుదల పెరిగిపోతోంది....................................



                             ( తరువాయి భాగం తీరిక దొరికినప్పుడు  )