Sunday 19 February 2012

ఆమె నవ్వు

                          ఆమె  నవ్వు 
వేకువ లో ఒక్క రంగూ లేదు
ఉషోదయం విషాదంగా అడుగుతోంది
తన వెలుగులుని...
పూలన్నీ వాడినట్టు వాకిట్లో నిలబడి
నిలదీస్తున్నాయి
తమ నవ్వులు ఏవని ?
కొమ్మ మీద కోకిల
నన్నే నిందిస్తోంది
వసంతాన్ని వొడిసి పట్టానని..
లోకం నా ముందు మోకరిల్లిందన్న ఆశ్చర్యం ..
అంతలోనే ఆమె నవ్వు చిన్నగా నా గుండెల్లో...
                                                              బి. వి ,